STORYMIRROR

kondapalli uday Kiran

Abstract Classics Inspirational

5  

kondapalli uday Kiran

Abstract Classics Inspirational

వృద్ధాప్యం కాకూడదు శాపం!

వృద్ధాప్యం కాకూడదు శాపం!

1 min
463



మనిషి జీవితం ఒక చక్రం,

బాల్యం ,యవ్వనం, వృద్ధాప్యం ,

వృద్ధాప్యం కాకూడదు శాపం!,

మార్గదర్శకులు వారు,

మన వయసు నుంచి వచ్చినవారు,

కష్టసుఖాలు తెలిసినవారు,

చిన్నప్పుడు మనల్ని వెన్నుండి నడిపించారు,

మనకు కష్టం వస్తే విలవిలలాడి పోతారు,

మనకే భారం అవుతారా!

పస్తులుండి మరి మనకి అన్నం పెడతారు,

రేయింబవళ్లు కష్టపడి, చదివించి,

మనకు ఒక జీవితాన్ని ఇచ్చారు,

మనకే భారం అవుతారా?

చిరిగిన బట్టలు వాళ్లు తొడుక్కుని,

నా కొడుకు మంచిగా కనబడాలని,

మనకి కొత్త బట్టలు కొని ఇచ్చారు,

మనకే భారం అవుతారా!

వాళ్లను ఆశ్రమంలో పడేస్తారు ,

ఒక్కసారి ఆలోచించండి,

మన సుఖమే వాళ్లకు ఆనందం

వృద్ధాప్యం అనేది ఒక సంతానం ,

వృద్ధాప్యం అనేది ఒక కుటుంబం ,

జన్మించిన కన్నవారి రుణం ,

వృద్ధాప్యం లోనే తీర్చుకొనుట ఒక వరం ,

ఇదే మానవ జన్మకి పరమార్థం.


Rate this content
Log in

Similar telugu poem from Abstract