బొజ్జ వినాయక.
బొజ్జ వినాయక.
1 min
380
బొజ్జ వినాయక,
మహిమగల కానిపాక,
ఊరంతా సంబరాలు నువ్వు రాక,
కుల, మతాలు ఉండవు,
ధనిక ,పేద ఉండవు,
ప్రతీ ఇంట్లో కొలువైనావు,
అందరి గుండెల్లో నిలిచిపోతావు,
నీ పేరు పలకని రోజు లేదు
నిన్ను తలచనీ మానవుడు లేడు,
నువ్వు లేనిదే సృష్టి లేదు,
ఉండ్రాళ్ళు, కుడుములు
నీకు ఇష్టమైన పిండి వంటలు,
అజ్ఞానాన్ని తొలగించి,
విజ్ఞానా వంతులుగా దీవించు,
నీ పేరు వింటే చాలు,
అవే మహిమగల శక్తులు,
కొండంత ధైర్యాలు,
నీలో నిత్యం ఉంటారు దేవత మూర్తులు.