ఉగాది పర్వదినం
ఉగాది పర్వదినం
శీర్షిక: ఉగాది పర్వదినం
ఉగాది అనగా, హిందువులకు ప్రత్యేకమైనదిగా,
తెలుగువారి మొదటి పండుగ,
తెచ్చింది సంతోషం నిండుగా,
ఆహ్లాదంగా చేసుకునే వేడుక,
కొత్త సంవత్సరం మొదలైంది ఆనందకరంగా,
ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు,
ధరించే కొత్తబట్టలు,
ప్రకృతిలో చిగురించే చెట్లు,
శిశిర ఋతువులో రాలే ఆకులు,
కోయిల కుహు కుహు రాగాలు,
ఉగాది పండుగ కు సంకేతాలు.
ఉగాది పచ్చడి కమ్మదనం,
ఉగాది పచ్చడి తీయదనం,
ఉగాది పచ్చడి తెలుగు వారికి ప్రత్యేకం,
కష్టసుఖాలను తెలియజేసే సందేశం,
షడ్రుచుల సమ్మేళనం,
ఇవన్నీ కలిస్తే ఉగాది పండుగ పర్వదినం.