శ్రమే ఆయుధం!
శ్రమే ఆయుధం!
సెలయేరును వదిలి,
బ్రతుకెక్కడని కదిలి,
చివరి పట్నం కి చేరి,
తలకిందులై తల్లడిల్లి,
వాళ్లని వీళ్ళని బ్రతిమిలాడి,
శ్రమనే ఆయుధం గా మార్చి,
కండ బలమే,
గుండె బలంగా చేసుకొని,
ధైర్యమే,
తన తోడై నమ్ముతూ,
భయంతో అడుగులు ముందుకేస్తు,
కన్నీళ్లను తుడిచి, నిరంతరం పోరాటం చేస్తూ,
ప్రతి పైసా కోసం ఆరాటపడుతూ,
బ్రతుకు బండిని లాగుతూ,
మెతుకులను దిగమింగుతూ,
రోజులను లెక్కిస్తూ,
జీవితం కోసం ఆశతో పోరాడుతాడు.