డబ్బు ఒక జబ్బు!
డబ్బు ఒక జబ్బు!
డబ్బు,
ఒక జబ్బు,
నోరు ఉండదు కానీ
వివాదాలను సృష్టిస్తుంది,
ఆకారం ఉండదు కానీ
బంధాలను విడదీస్తుంది,
చేతులు కాళ్ళు ఉండవు కానీ
ఎక్కడికైనా ప్రయాణిస్తుంది,
ఎంతటి వాడినైనా గుప్పెట్లో పెట్టుకుంటుంది,
అందరి చేతుల్లో ఒక ఆట ఆడుకుంది,
మనిషిలో ఉన్న రంగులను బయట పెడుతుంది,
తనకు సాటి లేదంటుంది,
మంచి వాడిని కూడా
చెడు గా మారుస్తుంది,
డబ్బు అనే ఊబిలో పడేస్తుంది,
స్వార్ధంగా తయారు చేస్తుంది,
ఎంత దూరమైనా తీసుకెళ్తుంది,
చివరికి బలిని కూడా కోరుతుంది,
ప్రపంచాన్ని సైతం ఏలుతుంది,
డబ్బు,
వ్యాధి కన్నా ప్రమాదకరమైన జబ్బు.