STORYMIRROR

Undavilli M

Abstract Classics Inspirational

4  

Undavilli M

Abstract Classics Inspirational

చూరుపిట్టకు చెల్లు చీటి!(కవిత)

చూరుపిట్టకు చెల్లు చీటి!(కవిత)

1 min
23.5K

   చూరుపిట్టకు చెల్లు చీటి! (కవిత)

   ------------------------------


కుంచించుకు పోతున్న పిట్టకధ!


పురుగుల్ని హరిస్తూ౼


రైతుకు దోహదపడ్డ పిచ్చుక కధ


నేలంతా తానేనని బ్రమిసే మనిషి


ఆకాశ హార్మ్యాలకు కూల్చేస్తున్న చెట్లు


విస్తరిస్తున్న రేడియేషన్ టవర్లు


అధిక దిగుబడులకు రసాయనాలు


కాలుష్యం జడలు విప్పుకుంటూ...


బొమ్మలకే పరిమితమయ్యే వీటికధ


శిథిల మవుతున్న ప్రకృతి సమతుల్యం


పరుచుకుంటున్న ప్లాస్టిక్ వ్యర్ధాల మేళం


అంతా కర్మాగారాల అతివేగం


చట్టాల్ని ఫోటో షాట్ లో బంధించి


పచ్చదనాన్ని లోపభూయిష్టం చేసి


అంతానికి తెర తీసారిపుడు...


ఇప్పుడు పిచ్చుకే కావచ్చు!


చివరి అంకంలో రెండు చేతుల జీవీ


తన చరిత్రను స్పర్శించే


ఆనవాళ్లను కోల్పోతుంది.

             ౼

              ౼ఉండవిల్లి.ఎమ్


               



Rate this content
Log in

Similar telugu poem from Abstract