జీవితమంటే
జీవితమంటే


క్షణం చచ్చిక్షణం పుట్టిసాగుతుంది జీవితం,
కణం పుట్టిఖననమయ్యిమారుతుంది ప్రయాణం
నిప్పు ఊసినీరు మింగిన,సుఖాన్ని కోసిశోఖాన్ని నింపినసాగే ప్రయాణంలోఆగే తీరికుండదు..
సత్యాసత్యాల మధ్యనలిగే నాలుకకునరాలు కుట్టేతెలివి మనది
పాప పుణ్యాలనులెక్కించే దేవుడికేరుసుము కట్టేతెగువ మనది
జీవితమంటేసత్యాన్వేషణోదూరాలోచనో,ఎదురుదాడోముందుచూపో,కాదు జీవితమంటేకాయానికతీతంగాకాలాన్ని నిర్మించడమే
-- శ్రీ --