అద్వైతం.
అద్వైతం.


ఆ విశాల నిశీధిలో విరిగిపోయాను. రాలిపోయాను. కాలిపోయాను. గాలినై. ధూళినై. నిప్పునై.
అంతా నేనై ఉద్భవించాను. ఉదయించాను. వెలుతురు లేని విశ్వం లో విహరించాను ఒక ఉల్కనై. నలువు రంగును పులుముకుని ఊరకలేసాను చీకటి జాడని వెతుకుతున్న నిప్పు కణమై.
జీవితం పొడుగాటి నిచ్చెన. గమ్యం చావువైపుకు నడిచే వంటరి దారి. తోడేవరు లేరు. రారు. నీ చావు నువ్వే చావాలి. ఏనుగు కుంభస్థలం లా..సింహం గాండ్రీమ్ప్ లా...కోయిల పాటల...పర్వతం ఎత్తులా...సముద్రపు లోతులా..నిశ్చలమైన ఆకాశం లా...