STORYMIRROR

Dinakar Reddy

Abstract Romance

5  

Dinakar Reddy

Abstract Romance

అలా ఎలా వెళ్ళిపోతావ్

అలా ఎలా వెళ్ళిపోతావ్

1 min
354

ఒక్క మాట చెప్పకుండా

చివరి కౌగిలి ఇవ్వకుండా

నా నుదిటిపై ముద్దు పెట్టకుండా


అసలేం జరిగిందో అర్థమయ్యేటట్లు వివరించకుండా

నా పరిస్థితి ఏంటో విచారించకుండా

మాటల్ని పూర్తి చేయకుండా


నీ శ్వాసకు ఆధారం నా చిరునవ్వయితే

నీ ఉనికికి ఆలంబన నా ఆలోచనలయితే

నీ ప్రాణం నా దగ్గర ఉంటే

నువ్వు చేసిన బాసలన్నీ నిజమయితే


అలా ఎలా వెళ్ళిపోతావ్

ఎక్కడికి వెళుతున్నావో తెలీకుండా

ఎప్పటికీ రావని స్పష్టం అయ్యేలా

అలా ఎలా వెళ్ళిపోతావ్

ఎంత ధైర్యం నీకు


వికసించిన నా ధైర్యం చిదిమేసేలా

విలక్షణమైన లక్ష్యాలు చెరిగిపోయేలా

నీటి మీద రాతలా 

మన ప్రేమనెలా చెరిపేస్తావ్

నన్నెలా వదిలేస్తావ్ 

అలా ఎలా వెళ్ళిపోతావ్


Rate this content
Log in

Similar telugu poem from Abstract