*మహనీయుడు*
*మహనీయుడు*


బ్రిటిష్ సైన్యాధికారి,
నీటిపారుదల ఇంజనీరు,
18 ఏళ్లకే భారతదేశానికి వచ్చి,
మొట్టమొదటిగా మద్రాసులో ఉద్యోగం చేరాడు,
19వ శతాబ్దంలో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం,
వరదలు వచ్చి 22 గజాల మేరకు కొట్టుకుపోవడం,
అయినా పట్టుదలతో ఆనకట్టను పూర్తిచేసి,
రైతుల కష్టాలను తీర్చి,
లక్షలాది ఎకరాలకు గోదావరి జలాలు,
అందుకే ఆయనను మరచిపోరు ఆంధ్రులు,
గోదావరి నది స్నాన పుణ్యన్ని కలిగించిన అపర భగీరధుడు,
కాటన్ సర్ బిరుదాంకితుడైనాడు,
ప్రజల గుండెలలో 150 సంవత్సరాల నిలిచి ఉన్న చిరంజీవి,
ఆయన ఓ అమరజీవి,
అలాంటి మహనీయుడ్ని నిత్యం,
స్మరించుకున్నా చాలు జన్మ ధన్యం