జీవంత కుసుమం
జీవంత కుసుమం


పూసిన జీవంత కుసుమాలు ఎంతో ఎంతో కోమలం,
వారి వికసించిన అందమైన వదనం ఎంతో విమలం,
ప్రతిదినం సమలంకృతం చేసెను మహి ఉపరితలం,
సేకరించటానికి నారి పూజారిలో ఉండెను అల్లకల్లోలం|౧|
ఇహలోక తరు లతలలో సుమములు చేసెను ఆగమనం,
రంగురంగుల రూప రేకులతో కనిపించెను ఉద్యాన వనం,
దేవుని సామీప్యం పొంది భాగ్యవంతులు అయ్యెను పావనం,
పుష్పాల క్షణిక శోభ అవగతం చేసెను క్షణభంగుర జీవనం|౨|
మృత్తిక నుండి వచ్చింది ఈ అమూల్యమైన జీవితం,
కుసుమాల వలె ఉండాలి శుభ్రం శోభితం సురభితం,
పరిమిత వ్యవధిలో సత్కార్యాలకు చెయ్యాలి అంకితం,
పునః మట్టిలోనే చెయ్యవలెను ఎప్పటికైనా ప్రత్యావర్తనం |3|