కవితల నిఘంటువు
కవితల నిఘంటువు
నేనొక కవితల నిఘంటువుని..
నా నిఘంటువులో
నేనొక అలుపెరుగని అక్షరాన్ని
అక్షరాలను అల్లే పదాన్ని
కలానికి పూసిన కావ్యాన్ని
కావ్యమాలకు కాసిన గీతాన్ని
ఆవేశపు ఆశల ఆశయాన్ని
అంతం లేని అంతరార్థాన్ని
నేనొక వారధిగా నిలిచే వాక్యాన్ని
అనంతమైన ఆలోచనని
నేనొక కవితల నిఘంటువుని..
మాటలు మార్చేసి అక్షరాలని అల్లేసి
పదాలని పట్టేసి వాక్యాలని వారధిగా చేసి
కవితలతో నిండిన నిఘంటువుని నేను..
