బ్రతుకు సమరం
బ్రతుకు సమరం
బ్రతుకు సమరం - విప్లవ శంఖం..
నా జీవితం ఒక ఉద్యమం..
బ్రతుకు పోరు కోసం విప్లవ శంఖం పూరిద్దామని చూస్తాను..
మొదటి అడుగు పూర్తవక ముందే వెనుకడుగు వేస్తాను బ్రతుకు వ్యథలకు కట్టుబడిపోయి..
ఆశగా చూస్తాను ఆకాశమే నా హద్దంటూ అడుగు ముందు వేయడానికి అగమ్యగోచరమై అడుగులు వేయలేక అలసిపోతాను..
ఆశలన్నీ ఆవిరయిపోయి ఆవేశంగా అడుగు వేస్తాను చివరి ఘట్టం చేరడానికి ఆవేదనతో తిరిగి మరలి వస్తాను ఆఖరి ఘడియలకు సమయం రాలేదంటూ..
బ్రతుకు పోరాటంలో ఇక విప్లవ శంఖం పూరించలేక అడుగు ముందుకు పడక చతికిలపడి బ్రతుకు సమరంలో ఓడిపోయి చివరి క్షణాలకై ఎదురు చూస్తూ ఉంటాను..
బ్రతుకు వెతలలో వేసారి..
నా జీవితం ఒక ఉద్యమం అని నాకు నేను చెప్పుకుంటూ ఉంటాను.
కడసారి వరకైనా గెలుస్తానేమోనని..
