ప్రేమ గులాబీలు
ప్రేమ గులాబీలు
అంశం: లేత గులాబి (పింక్)..
లేత గులాబీలు అన్నీ గుత్తులుగా ఇచ్చాను
ఎందుకో తెలుసా!
దాని అంత సున్నితంగా ఉన్న నీ మనసుకు అదే సరి అయిన బహుమతి అని.
లేత గులాబీల మృదుత్వాన్ని పొందు పరిచి ఇచ్చాను నా హృదయాన్ని
ఎందుకో తెలుసా!
కఠినమైన నా హృదయం నీకు గుచ్చుకోకూడదని.
ఈ లేఖను మనసుతో చూడొక సారి
ఎందుకంటే !
గులాబీల పరిమళం అత్తరుతో రాసాను మరి
ఆ పరిమళంలో నీ హృదయం పరవశించాలని.
లేత గులాబీల గుత్తులను గుండెల్లో పదిలంగా దాచుకుంటావని.
నా మనసెరిగి మనసుతో మమేకమైపోవాలని.
లేత గులాబీల గుత్తులను గుది గుచ్చి ఇచ్చాను అది నా మనసే తెలుసుకో మరి!!
