Rama Seshu Nandagiri

Abstract

4  

Rama Seshu Nandagiri

Abstract

పర్యావరణం (prompt 17)

పర్యావరణం (prompt 17)

1 min
23.3K


విచక్షణా రహితంగా ప్రవర్తిస్తే మారుతుంది. ప్రకృతి వికృతిగా


ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే మన జీవితాలే ఔతాయి తారుమారుగా


ప్రకృతిని మనం కాపాడితే మేలు చేస్తుంది ఎంతైనా మనకి


పచ్చదనం, పరిశుభ్రత గురౌతున్నాయి మానవ నిర్లక్ష్యానికి



నిర్లక్ష్యం చేస్తే నష్టపోయి, కష్టపడేది భూమిపై ఆధారపడే మనం


వృక్ష సంపద పెంచుతూ, రక్షిస్తూ, కాపాడుకోవాలి మనని మనం



జల, వాయు, భూమిని అనాలోచితంగా చేస్తున్నాం కలుషితం


అది మనకే తెచ్చి పెడుతోంది ముప్పు అని అసలు గుర్తించం



మనం శుభ్రత కోసం ఇళ్ళల్లో ని వ్యర్థాలను బైట‌ పారవేస్తాం


ఫ్యాక్టరీ పొగలతో పర్యావరణాన్ని పూర్తిగా కలుషితం ‌చేస్తాం



వ్యర్థ జలాలను నదులకు మళ్ళించి తెచ్చాం తాగునీటి కరువు


అడవులను నరికితే సాగునీరు లేక వ్యవసాయమైంది బరువు



పర్యావరణ కాలుష్యానికి ఎవరో కాదు మనమే‌ బాధ్యులం


మరి దానిని బాగు పరచడానికి బాధ్యత పడాల్సిందే మనం.









రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్