విజయసోపానం
విజయసోపానం
మనిషిని బ్రతికించి ఉంచేది ఆశ
నిలువునా కృంగదీసేది నిరాశ
లొంగిపోరాదు ఎన్నడూ పరాజయానికి
తలవంచరాదు ఎప్పుడూ అపజయానికి
ఎదుర్కోగలవు నిలబడితే ఓటమిని
సాధించ గలవు కసితో గెలుపుని
మార్చుకో ఓటమిని మొదటి మెట్టుగా
ఎక్కిపో విజయసోపానాన్ని అవలీలగా
వెనుకాడకెన్నడూ జీవితంలో పోరాటానికి
వస్తుంది విజయం వరించి తానే చెంతకు
భయపడినంతలో వీడదు ఓటమి భయం
ఎదురొడ్డి నిలిచిన వారినే వరించు విజయం
రానీ ఎన్నైనా దారిలో కష్టాలు, నష్టాలు
చూడకు వీడి నీ లక్ష్యాన్ని నలుదిక్కులు
అయినా సాగిపో జీవన రణరంగంలో
మానవా! దూసుకుపో అలుపెరుగక విజయపథంలో
