లే... పడినా పై పైకి లే!
లే... పడినా పై పైకి లే!


లే... పడినా పై పైకి లే!
మళ్లీ మళ్లీ పడినా పర్లే!
లే... ఎగసే కెరటమల్లే!
ఎవరేమనుకున్నా సర్లే!
తల్లి పోయినా తండ్రి పోయినా
తోబుట్టిన తమ్ముళ్ళు పోయినా
అక్క పోయినా చెల్లి పోయినా
నమ్ముకున్న స్నేహితులు పోయినా
లే... పడినా పై పైకి లే!
మళ్లీ మళ్లీ పడినా పర్లే!
పదవి పోయినా పరువు పోయినా
నమ్మిన చేతిన మోసపోయినా
పొలము పోయినా బలము పోయినా
కలల కోటలు కూలిపోయినా
లే... పడినా పై పైకి లే!
మళ్ళీ మళ్ళీ పడినా పర్లే!
మబ్బులు నీటిని తేకపోయినా
వానలు సరిగా పడకపోయినా
పంటలు చేతికి రాకపోయినా
ఆకలి ప్రేగులు ఎండిపోయినా
లే... పడినా పై పైకి లే!
మళ్లీ మళ్లీ పడినా పర్లే!
ముఖమున అందము కరిగిపోయినా
ప్రేమను అద్దము విరిగిపోయినా
అసమ్మతి మనువు జరిగిపోయినా
నుదిటిన కుంకుమ చెరిగిపోయినా
లే... పడినా పై పైకి లే!
మళ్ళీ మళ్ళీ పడినా పర్లే!
కలలు కలలుగా మిగిలిపోయినా
కళలు విరులుగా వాడిపోయినా
బంధములన్నీ వీడిపోయినా
లక్ష్యఛేదనలో ఓడిపోయినా
లే... పడినా పై పైకి లే!
మళ్ళీ మళ్ళీ పడినా పర్లే!
జీవితమంతా తోడై!
అన్ని వేళలా నీడై!
అన్యోన్యంగా ఉన్ననూ!
మేడపైకి ఓడపైకి వచ్చిననూ!
పాడిపైకి అజకు రాడెవడూ!
నీతో నాతో తోడెవడూ!
అటులైననూ ఇల
అటువంటి మనుజుల
చులకనైన విమర్శల
దాడులకు ఏల
వంచెదవు నీ తల
ఏదేమైననూ
చోటేదైననూ
రోజేదైననూ
రాజెవడైననూ
లే... పడినా పై పైకి లే!
మళ్లీ మళ్లీ పడినా పర్లే!
లే... ఎగసే కెరటమల్లే!
ఎవరేమనుకున్నా సర్లే!