జీవితం
జీవితం


నిన్న నిన్ను మరువదు
నేడు నిన్ను విడువదు
రేపు నీకు తెలియదు
నిన్ను జీవితం వదలదు !!
ప్రతి గంట కడుపు మంట
ప్రతి నిమిషం కాలకూట విషం
కొందరికి వడ్డించిన విస్తరి
మరి కొందరికి వీడని మిస్టరీ !!
పుట్టేటప్పుడు ఏడుపు కంట
పుట్టిన తరవాత కడుపు మంట
మన శాంతి కరువు బయట ఇంట
జీవిత పరమార్ధం ఇదే నంట !!
రోజుకో రామాయణం
పూటకో భారతం
ఘడియకో భాగవతం
తెలుసుకో నా మనోగతం !!
ధనవంతుడే బలవంతుడు
బలవంతుడే భగవంతుడు
భగవంతుడిదే జీవితం
బలహీనుడి బతుకు దుర్భరం !!
మనిషి పొతే మర లి రాడు
మంచి పొతే మనిషి కాడు
మంచికి పొతే మిగిలేది గోడు
దైవం వదిలేస్తే ఎవడురా తోడు !!
తెలివితో గెలవారా
నీతికై నిలవరా
దైవాన్ని కొలవరా
ప్రతి రోజు నీదిరా !!
మనుషులు మృగాలు
చేస్తారు దగాలు
ఎందుకు దిగాలు
జీవితం సవాలు !!
జరిగిన మంచి తేల్చుకో
జీవితాన్ని మలచుకో
అందరి మనసు గెలుచుకో
ఆదర్శంగా నడచుకో !!