STORYMIRROR

కావ్య రాము

Inspirational

5  

కావ్య రాము

Inspirational

ఓ అద్బుతమా.. !!

ఓ అద్బుతమా.. !!

2 mins
673

ఓ అద్బుతమా.....!!


నీకు వందనం.....!!


అవనివి నువ్వే..


అనంతానివి నువ్వే....!!


అంకురం నువ్వే....!


ఆశ నువ్వే....!!


అంకురించిన నాటి నుండే మోగింది నీ గుండెల్లో ఓ రణభేరీ.....!!!


ఏమరుపాటుగా ఉంటే ఏ బలి నిన్ను బలిచేస్తుందో అని.....!!


ఓ అద్బుతమా.....!!


నీకు వందనం.....!!


అవహేళన నీ బతుకైంది....


అలుసత్వం ఆచారమైంది..


అణగారిన తనం జీవనగమనమైంది.....


అమ్మ ప్రేమ పలుకులు ....,


నాన్న అనురాగం ఆస్వాదించిన క్షణం....


మకుటం లేని మహారాణి వి నువ్వు...


ఆ ఆశ తీరే లోపే ఇంకో ఇంటి ఇంతివై.....


ఆ ఇంటికి దాసీలా మారి నీ మనుగడనే మరిచిన మగువవి నువ్వు.....


ఆశల తీరాన్ని అందుకోవాలని ఉన్నా అందుకోలేవని తెలిసి అన్ని నీలోనే అణచుకొని......


అబద్ధమైన నవ్వుని అలంకరించుకున్న అందమైన పువ్వువు నువ్వు......


ఎన్ని ఇక్కట్లన్నైనా ఇష్టంగానే భరించే నిలువెత్తు సహనానివి నువ్వు.........


ఓ అద్బుతమా.....!


నీకు వందనం.....!!


సర్వాన్ని శాసించే నారీ శక్తి నీకున్నా నీలో సగమైన నరునికి ఇచ్చి ,


అర్థభాగానికే పరమార్థం చూపిన అవనిజవి నువ్వు...


నాలుగ్గోడల నడుమ నలిగినా నోరుమెదపని మూగదానివి నువ్వు....


నిండుశూలాలిగా నిండుకుండని మోస్తున్నా ఇంకెన్నో మోయాల్సి ఉండగా......


వాటి ముందు ఇది బరువా అని సర్దిచెప్పుకునే వనితవి నువ్వు.....


నీ తోడునే నీ నీడగా మార్చుకొని,మైమరచిపోయే మాలినివి నువ్వు.....


ఆకరి వరకు ఒంటరివి అయినా అన్నింటిని నీ ఒడిలోకి చేర్చుకొని లాలించి పాలించే ప్రేమామృతానివి....


ఒడిలో ఒదిగిపోయే బిడ్డ వేసే అడుగులకు సంబరపడుతూ,


ఆ అడుగులే ఒడ్డుకు చేరాక ఒగ్గేసినా ఓరిమినే పంచే ఓపికమ్మా నీది...!!


ఓ అద్బుతమా.....!


నీకు వందనం.....!!


నువ్వే లేని నాడు....


నిమిషం కూడా నడవని లోకం కదా.....


నువ్వని తెలిసి నలుసువని చూడక....


నీ ఊపిరి తీసినా నిందించక మైనంలా కరిగే మైనపు బొమ్మవు నువ్వు......


నరరూప రాక్షసున్ని నవమాసాలు మోసి....... నయవంచన చేసినా నా బిడ్డ అని అక్కున చేర్చుకునే పిచ్చిదానివి నువ్వు......


నిన్నే నిందించకుండా ఉండని నరం లేని నాలుకలున్నాయి ఈ ఇలలో....


అయినా ఈ మాయాలోకంలో ఎదురోడి పోరాడుతూ ఉన్న నారివి నువ్వు.....


ఓ అద్బుతమా.....!!


నీకు వందనం.....!!


నారీ.....!!!!


నిన్ను నువ్వు చూపించే క్షణం కోసం నీతో నువ్వే పోరాడు....


నలుగుతున్న ఆశలకు రెక్కలు తొడిగి మరల నీ రెక్కలను విదిల్చి ఆకాశంలో విహంగమై నీవున్న నిజాన్ని ఈ లోకానికి ఎలుగెత్తి చాటు....


సమన్యాయం కోసం సమర భేరీ మోగించకనక్కర్లేదు.....సహనంగా ఉండక్కర్లేదు......

నరనారీతత్వాన్ని చూపేలా నీకేది అసాధ్యం అని లోకానికి నిరూపించు.....


నరం లేని నాలుకలకు అడ్డుకట్టవేసే నేర్పును సంపాదించు .....


నువ్వు నా కింద అనే అక్షరాల అడ్డమైన తోవకి.....


నువ్వునేను సమానం అనే అసలైన తోవకి మార్గనిర్దేశం చేయు....


నీ కడుపున పుట్టిన బిడ్డని నువ్వే అలుసుగా చూడడం మాని.......

ఇచ్చే విలువల్లో వైరుధ్యాలు చూపక సమాన స్థితిగతులను చూపు......


ఆడమగ చెరిసమానం అన్న ఆలోచనని అందరి మనసుల్లో నాటు..........


ఆ మార్పు అమ్మగా నీతోనే మొదలవ్వాలి.....


అప్పుడే మనింటి నుండే ఆ మార్పు దానంతట అదే మొదలవుతుంది......


                                                       రచన


                                                   -కావ్యరాము


*సహనమూర్తులైన మగువలందరికి ఈ కవిత అంకితం*


Rate this content
Log in

Similar telugu poem from Inspirational