చేయెత్తి జైకొట్టు
చేయెత్తి జైకొట్టు


ప౹౹
తేట తేట తెలుగులో తేటగీతి ఒకటి పాడనా
మాటమాటకి తేనె పలుకొకటి రుచి చూడగా ౹2౹
చ౹౹
చరణాలే చరణ తాండవమాడి తన్మయించా
కారణాలే తెలుపని మదికలసి అన్వయించా ౹2౹
పద పారిజాతాలే పరవళ్ళై కలిపి ప్రవహించ
ఎద పరిణామాలే ఊహించి తానే ఆవహించ ౹ప౹
చ౹౹
కదలిరావా కనకపు సింహాసనాలే సమకూర్చ
వదలిరావా వారసత్వపూ నిర్లక్ష్యాన్ని కూల్చ ౹2౹
భావవ్యక్తీకరణ తెలుగులో భాషకు ప్రాభవమే
వైభవ కీర్తులు పూయించిన అదీ అనుభవమే ౹ప౹
చ౹౹
చేయెత్తి జైకొట్టని తెలుగుతనమే ఓడొల్లతనం
పల్లెత్తి మాటనని పాలకులది పనికిరానితనం ౹2౹
నీ వంతు కృషిని నిలుపక సలిపి చూపవోయి
నిలువెత్తు తెలుగునే నిలిపి నిరూపించవోయి ౹ప౹