కొంచెం నేర్చుకుందాం!!
కొంచెం నేర్చుకుందాం!!


కొంచెం నేర్చుకుందాం!!
-------------------------------
అదురుతున్న గుండెల్ని
ఆదుకొనేందుకు
ఆదరించేందుకు
ఆప్యాయత నందించేందుకు
కంటికిమూతికి అడ్డుగ వస్తుందా జాతి?
'జీవికి జీవియే..సహజంగా
ప్రకృతిచ్చిన బ్రతుకుతోడు'
చదువనేర్చిన మనిషికి మాత్రం
ఈ సూత్రం పనికిరాదు
ముందూవెనుకగ అమ్మకు
ఒకటేకడుపున వరుసగ
పుట్టినవారే అయినా...........
కడుపునపుట్టినపిల్లలకైనా
ఎదుగుతుపోతే అందరు వెగటే చివరికి..........ఎవరికివారే!
కష్టాల్లో ఎదురుపడితె
ఏవగింపే......పరారే!
ఇరుకునబడి కనబడితే..
సగటున చెడుకంగారే!
బెదురిసాయమడిగితే
ఉదుటున లేస్తూ పరుగే
కళ్ళుతెరుచి మారదాం కొంచెమైన ఇకనైనా
ప్రేమించేజంతువుల్ని కనులారా చూసైనా!!