నీడలువెక్కిరిస్తున్నాయ్
నీడలువెక్కిరిస్తున్నాయ్


నీడలువెక్కిరిస్తున్నాయ్
...............................
కదపాల్సినపావులు
కనిపిస్తున్నాయ్
కదపేవాళ్ళెవరో?
అగుపించట్లేదు
ఆడే ఆట అదేమిటో
అర్థమవటంలేదు
కదలినా
కదలకున్నా
ఎక్కుతున్నప్రొద్దు
వెక్కిరిస్తోంది
నీడల్నేకొలమానంగా
చూపిస్తూ.....
మాంద్యాన్ని
ఆలస్యాన్ని కొలుస్తూ
ఔను మరి
చైతన్యం లేనిదేదైనా
వ్యర్థమేగా ఆలోచిస్తే!!