మేం
మేం
1 min
585
ఎవరో వేసిన దారిన
మనమెందుకు పోదాం
సరికొత్త దారి వైపు
అడుగులు వేద్దాం!
చుక్కలనెందుకు లెక్కిస్తూ
దిక్కులు చూద్దాం
భానుడై ధగధగ
కాంతుల ప్రకాశిద్దాం!
బాలురమూ కాదు
భాలాంకాలమూ కాదు
కాంతి వేగంతో ఎవరికీ
దొరకక సాగుదాం!
తిమిరం లేదు
సోమరులం కాదు
సాధించాలని, కొత్తదేదో
సృష్టించాలని తిమురు
ఆశావాదులం,
అహంకారం లేదు
సాధించిన కొంతతో
తృప్తి పడే ప్రసక్తే లేదు!
తిరుగుబోతులం కాదు
తిరుగుబారు వారలం కాదు
తప్పు చేయు వారిపై
తిరుగుబాటుదారులం!
మూలన పడేసిన
బియ్యపు సంచులం కాదు
మనం
రేపటి సంచలనం!
పాతరోతల తిరస్కారులం
సంస్కారం లేదంటే
మీ విజ్ఞతకు
మా సవినయ నమస్కారం!