అందనిదే ఆనందమా
అందనిదే ఆనందమా
ఉన్న దానితో తృప్తి పడక
ఏదేదో కావాలని
అర్రులు చాస్తూ
ముందుకు వెళుతూ
తొందర పడుతూ
అందనిదే ఆనందమనుకుంటూ
ప్రతి కౌగిలీ ప్రేమని
ప్రతి మనసూ స్వాతి ముత్యమని
భ్రమ పడి
లేని బంధాల కోసం సాగిల పడి
తెగిన గాలి పటంలా
ప్రేమ ప్రేమ అని
తపిస్తున్న వెర్రి మనసా
కాస్త భూమ్మీద నిలువనీయవే
నన్ను కాస్త బ్రతుకనీయవే