దశరధుడికి రామ లాలి ప్రేమ లాలి
దశరధుడికి రామ లాలి ప్రేమ లాలి


లాలి లాలి లాలి లాలి
లాలి లాలి......
లాలి లాలి లాలి లాలి
లాలి లాలి......
సంసార సాగర గర్భంలో
నమ్మొచ్చిన ఆలి కోసం
భాద్యతైన బిడ్డల కోసం
అలుపెరుగని ప్రయాణం చేస్తూ
ఒంటిని కష్టాల కొలిమిలా కోస్తూ
అలసిన గ్రహణమెరుగని సూరీడా
కూసంత సేదతీరవయ్య
అయ్యా.....
నీ సుఖం కూడా కూసంతా సూసుకోవయ్య
లాలి లాలి లాలి లాలి
లాలి లాలి......
త్యాగం ఎట్లుంటదంటే లోకానికి
నీ రూపాన్నే సూపిత్తనే
సహనం లో నిన్ను మించినోళ్లు ఉన్నారని
భూతల్లికి నీ గురించి సెప్తనే
ప్రేమని కూడా ప్రేమించడం నేర్సుకోమని
నీ ప్రేమని రవ్వంత ఇస్తనే
తలరాతకి ఒగ్గేసే దేవుడిని కూడా
తప్పుల్ని క్సమించి కాపాడే తండ్రిలా
మారమని నిన్నే సూపిత్తనే
నా జీవిత పంటని పండించిన
నిస్వార్ధమైన వాత్సల్య స్వార్ధపరుడా
కూసంత సేదతీరవయ్య
అయ్యా.....
నీ సుఖం కూడా కూసంతా సూసుకోవయ్య
లాలి లాలి లాలి లాలి
లాలి లాలి......
కన్నీళ్ళ కష్టాలు దరిసెరకుండా
సుట్టూ ఆనకట్టు కట్టిన మెస్త్రీవైనావే
బిడ్డల్ని గుండెలపై బాధ్యతని భుజాలపై
మోస్తు కృంగిపోయిన కూలివయ్యావే
అమ్మ పక్కన ప్రేమికుడయ్యావే
ఆడ బిడ్డ వెనకాల సైన్యమయ్యావే
కొడుకు పక్కన స్నేహితుడయ్యావే
బాధలో భయములో
బరువులో బలహీనతలో
నడిపించిన నావికూడయ్యావే
మా శుభం కోరి నీ అశుభాల్ని కొనితెచ్చుకున్న
అనంత లోకాల అసాధ్య వీర యోధుడివయ్యావే
పున్నామ నరకం నుండి కాపాడే వాడు కొడుకు అవుతాడే కానీ
నిన్ను నిరంతరం నరకంలో ఉంచి నేనీ పాపిష్టి కొడుకయ్యానే
మారుజన్మలోనైనా నీకు తండ్రినై రుణం తీర్చుకునే
అవకాశం ఇయ్యవయ్యా మహానుభావా.
ఇప్పుడైనా నీ సుఖం నువ్వు సూసుకోవయ్యా కూసంత సేదతీరవయ్య
అయ్యా.....
నీ సుఖం కూడా కూసంతా సూసుకోవయ్య
లాలి లాలి లాలి లాలి
లాలి లాలి.....
నాన్న............