కలియుగ వికల్ప భార్గవ రాముడు
కలియుగ వికల్ప భార్గవ రాముడు
రామకృష్ణ జానకి
పుత్రస్య
సూర్య భార్గవ
నామధేయస్య
అగ్రజ రూపేణా
ఈ మానవుడు
బ్రాహ్మణ హృదహధారుడు
క్షత్రియ రూప దేహధీరుడు
అగ్నికీలల సంసార సంద్రాన్ని
బాల్య దశనుండి మధించి
సుఖసౌఖ్యాలని త్యజించి
సూర్యనారాయణ రాజ్యలక్ష్మి దంపతుల కానలో
ప్రేమ కొలనులో దిక్సూచి వెలుగులో
బ్రహ్మరాతని ధిక్కరించి
సంఘర్ష పూరితమైన జీవిత గాధని
స్వీయసంపాదకుడై లిఖించి
తల్లికి గోడుని, భార్య తోడును
మనో:శక్తినిచ్చే ఆయుధాలుగా చేసుకుని
యజ్ఞోపవీత ధారుడై
అంతర్:మధన క్రోధుడై
చిరునవ్వుని పరశుగా చేసుకుని
కష్టాల కడలిని చీల్చుకుంటూ
ఆనందక్షీర సాగరం వైపు అడుగులేస్తున్న
సుజాత సమేత రాముడు
ప్రేమ వెలుగుల సూర్యుడు
అఖండ హృదయ భువనాల పాలకుడు
భగ భగ మెరిసే భార్గవుడు వీడు
సూర్య కిరణాలని అరచేతితో ఆపలేం
భూమిపై పాదం మోపి సొంతం అనలేం
అలల ముందు నుంచొని భయపడి వెనక్కిపోతోంది అనుకోలేం
గాలిని పిడికిలిలో బిగించలేము
నింగిని దృష్టితో కొలవలేము
అలాగే ఈ భార్గవుడి జీవితాన్ని , మనసుని
తక్కువ అంచనా వేయకూడదు
విస్ఫోటం బొట్టు పెట్టి రాదు
అది భయానకం
వీడు బ్రహ్మాండం