వెన్నెల కానలో పూసిన విరులు
వెన్నెల కానలో పూసిన విరులు


ఎండిపోయిన చిగురు చినుకులు నేలపై కురుస్తుంటే,
కరిగిపోయిన కొమ్మల రెక్కల అరచేతులు ఆకాశాన్ని ఆర్థిస్తుంటే ,
నిశిలో కప్పుకుపోయిన ధరణి నిస్సహాయతతో దీనంగా చూస్తుంటే,
వనమాలి కూడా విరమణ వీణ వాయిస్తుంటే,
రానేలా రాణిలా వసంతాన్ని అన్నీ తానై తీసుకొచ్చింది నిండు పున్నమి జాబిలి,
విసిగిపోయిన జీవితానికి,
విసిరిపోయిన వసంతానికి,
విరిసి ఆవిరైన విరుల విలాసానికి,
విచారాల ఆచారాల అవిశ్రాంతికి,
వదిలిపోయిన వీనుల వినోదానికి,
తన అధరాల చిరునవ్వుని ప్రేమగా అందించి కొత్త పుంతల్ని తొక్కించి తన లోగిలిలో కౌగిలిలో లాలి జోలాలి పాడుతూ నిద్రపుచ్చుతున్న వెన్నెలమ్మని చేరుకునేందుకు నా చల్లని చూపుల పారవశ్య ప్రయాణం