కలకంఠి
కలకంఠి
ప౹౹ అందివచ్చే అందమా అదనులోనే చూడుమా సందించే శరమా సాగివచ్చి నువ్వూ వేడుమా ౹2౹
చ౹౹ కలకంఠి రూపం కనులకే కలిగించిలే కలవరం ఎదనంటి ఎదలోనే నిలుచుటే కదా అవసరం ౹2౹
ప్రేమలోన కొత్తగాను కనుగొనేది ఏమి లేదులే తమలోని కాంక్షను కళ్ళలో చూపినా చాలులే ౹ప౹
చ౹౹ పూలలోని పరిమళమంత వలపుకే వందనం పళ్శలోని తీపిదనం ప్రేమకంతకు స్వాంతనం ౹2౹
కోపగించకూ కోరికను మొత్తం వెళ్ళడించను ఉపయోగించకు యుక్తినే మది ఊరడించను ౹ప౹
చ౹౹ చారడేసి కళ్ళు చామంతుల్లా అందం చెంపకే బారడేసిచూపులతో చాకుల్లా పొడిచి చంపకే ౹2౹
మగువ మనసే మరులతో కరుగునని తెలుసే తెగువచేసి ఎలమి తెరువే నిరూపించనీ కలిసే ౹ప౹