STORYMIRROR

ARJUNAIAH NARRA

Romance

4  

ARJUNAIAH NARRA

Romance

నాకోసం నీవునీ కోసం నేను

నాకోసం నీవునీ కోసం నేను

1 min
531

నీ అలికిడితో ......

నా తనువుకు చలనం కలిగించింది నీవు

నీ కళ్ళతో .......

నా కళ్ళలో స్నేహగీతం పలికించింది నీవు

నీ మాటల మంత్రంతో ......

నన్ను సమ్మోహణ పరిచింది నీవు

నీ పదాలతో .........

నా పెదవులపైన చిరునవ్వు పూయించింది నీవు

నీ ముచ్చట్లతో ...

నా మొఖాన సంతోషం పుట్టించింది నీవు

నీ స్పర్శతో ......

నా శరీరంలో అణువిస్ఫోటనం గావించింది నీవు

నీ శ్వాసతో .......

నా మదిలో ప్రణయ గీతం అల్లింది నీవు

నీ పరిచయం.........

నాకు ఒక వింతైన ప్రపంచాన్ని పరిచయం చేసింది 

ఆ అందమైన ప్రపంచంలో .......


నీవొక పువ్వువు

నేనొక పరిమళం

నీవొక తుమ్మెదవు

నేనొక తేనెను

నీవొక వేణువు

నేనొక రాగాన్నీ

నీవొక సంద్రానివి

నేనొక కెరటాన్ని

నీవొక సూర్యుడివి

నేనొక కిరణాన్ని

నీవొక చంద్రుడివి

నేనొక వెన్నెల కాంతిని

నీవు లేనిదే నేను లేను

నేను లేనిదే నీకు అందంలేదు

నీవు లేనిదే నాకు అస్థిత్వం లేదు

నేను లేని నీ ఉనికి కూడా శూన్యం


అందుకే .....

నా కోసం నిన్ను, నీ కోసం నన్ను

నీ స్పందనకు నా ప్రతిస్పందన

నాలో నీవు....నీలో నేను

ఒకరిలో ఒకరిని కలుపుకొమ్మంది ప్రకృతి...



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance