ప్రేమ చిగురులుఅర్జున్ నర్ర
ప్రేమ చిగురులుఅర్జున్ నర్ర
చూపు
ఒక మొన దెలిన బాణం ముళ్లులాంటిది వేగంగా వదిలితే
అది గుండెకి గాయం చేస్తుంది
తీవ్రమైన దుఃఖానికి గురి చేస్తుంది
***
ప్రేమ
ఒక పుష్పం లాంటిది
చిగురుస్తు రెమ్మలకు వన్నె తెచ్చి
కళ్ళకు అందంగా కనిపిస్తుంది
వాడినపుడు చెడినదానిలా అనిపిస్తుంది
****
ప్రేమ
ఫలించినవాడికి ఒక తియ్యని రాగం ఫలించని వాడికి ఒక తీవ్రమైన శోఖం
*****
ప్రేమ
ఒక తేనెటీగల
మనసుకి తీపిని ఇస్తుంది
గాయం కూడా చేస్తుంది
****
కౌగిలి
ఓ వింత అనుభూతి
మనసు రహస్యంగా
రాసే మహామంత్రం
***
ముద్దు
గుండె మాటలను
పలికే మృదువైన
నిశ్శబ్ద అనుబంధ ముద్ర
***
ఆశ
ఒక జ్వాల లాంటిది
అది పై పైకి ఎగచిమ్ముతూ
మనసును
హద్దు దాటేలా చేస్తుంది
ఆ తరువాత కటకటాల్లోకి తోస్తుంది
***
కోరిక
ఒక నిప్పే
అది శరీరాన్ని దహించి వేస్తుంది
సాంగత్యం దొరకనపుడు
పడగ విప్పి
దారిన పోయే వారిని కాటేస్తుంది
***
మనసు
ఒక బడబాగ్ని
తనువును తగలబెడుతుంది
కాలం మందు కనుక్కోలేనప్పుడు
చివరికి చావుతోనే సమాదానపడుతుంది
****
పెళ్ళి
ఇది ఒక లొల్లి
చేసుకున్న వాళ్ళదోకటి
చేసుకోబోయే వారిదొకటి
***
పుస్తెల తాడు
రెండు మనసులను
కలిపి కట్టిన దారం
పవిత్రంగా ఉంటే హారం
అపవిత్రమైతే ఉరితాడు
***
భార్యభర్తలు
అర్థం చేసుకుంటే
ఆలుమగలు
లేకుంటే
వెన్నుపోటుదారులు
అందుకే
ఈడు జోడు కాదండి
కాస్త తోడు నీడ అనండి
***
సంతానం
మొదట్లో సంతోషానిస్తుంది
ఎదుగుతుంటే ఏడిపిస్తుంది
స్థిరపడితే
చిరునవ్వు పూయిస్తుంది
లేదంటే
స్మశానంలో శోఖమవుతుంది
*****

