STORYMIRROR

ARJUNAIAH NARRA

Children Stories Inspirational Children

3  

ARJUNAIAH NARRA

Children Stories Inspirational Children

అక్షర అంజలి

అక్షర అంజలి

1 min
172

చదువు

జ్ఞానాన్ని ఇస్తూ

గుణాన్ని మారుస్తుంది

సైన్సు అర్థం కాకపోతే

మౌఢ్యం రాజ్యమేలుతోంది


***

తరగతి గది

చేతి రాతతో పాటు

మన తలరాతను

మార్చుకునే దివ్య దేవాలయం


***

 విద్య

మన మేధస్సు కష్టఫలం

ఎవరు దోచుకోలేని సంపాదన


***

పుస్తకం

మన చెంత ఉండే జ్ఞాన భాండాగారం


***

స్కూల్ బ్యాగ్

కేవలం పుస్తకాలు, పెన్నులు

అనుకుంటే పొరపాటే

ఎందుకంటే

అది అమ్మ నాన్నల ఆశలు


***

పాఠం

జీవితాన్ని మార్చే మార్గదర్శి

అర్థమైతే జ్ఞానం

కాకపోతే అజ్ఞానం


****

విద్యార్థులు ఇపుడు బాలలే

కాని భవిష్యత్ మిణుగురులు

ప్రపంచ శిల్పులు


****

ఉపాధ్యాయులు

జ్ఞాన కిరణాలు

దేశ అభివృద్ధి

కార్యాచరణ కారకులు


*****

సమయం

పొదుపు చేస్తే నిలిచేది కాదు

ఎవరి కోసం ఆగేది కాదు

క్షణం నిన్ను మార్చగలదు

ఒక రోజు ప్రపంచాన్ని మార్చగలదు

నేడు నీవు వృధా చేసిన

రేపు తప్పక వెతికక తప్పదు

*********

భవిష్యత్తు అంధకారమైంది

ఎందుకని ఆలోచిస్తే

అర్థమైంది ఏమిటంటే

నేను తరగతి గదిలో నిదురపోయాను

 *****

అనుభవం

బడిలో కాదు

కాలం ఒడిలో

కన్నీళ్లతో నేర్చుకున్న పాఠం

నేర్పింది మర్చిపోలేం

ఓడినవారికి పాఠం అవుతుంది

గెలిచిన వారికి అహంగా మారుతుంది అర్థం చేసుకోలేని వారిని బాధితులుగా మారుస్తుంది

*******  


Rate this content
Log in