STORYMIRROR

ARJUNAIAH NARRA

Children Stories Inspirational Children

3  

ARJUNAIAH NARRA

Children Stories Inspirational Children

గోరు ముద్దలు

గోరు ముద్దలు

1 min
148

తలిదండ్రులు...

మనకు జన్మనిస్తారు

మన ఉజ్జ్వల భవిష్యత్తు కోసం

కొవ్వొత్తిలా కరిగిపోతారు

****

అమ్మానాన్నలు...

బతుకు సమరంలో

 అర్థం కాని మిత్రువులు

ఆమరత్వంలో అమృతబిందువులు

****

నాన్న  ప్రేమ...

ఉదయం సూర్యుని

వెచ్చని కిరణాలు

అమ్మ ప్రేమ....

రాత్రి చంద్రుడి

చల్లని కిరణాల వంటిది

 * ***

నాన్న ప్రేమ.... విశాలమైనదే 

కానీ..

అమ్మ ప్రేమ.... అనంతమైనది

****

పిల్లలు...

బోసి నవ్వుల మోములు

మన ఆశలకు కట్టే ఫ్రేమ్లు

సరిగా పెంచకపోతే

పెద్దయ్యాక పగిలిన ఫ్రేమ్ల గాజు వక్కలు

**** 


 పిల్లలు...

మన కంటి పాపలు

బాగుంటే గుండె సవ్వడులు

లేకుంటే గుండెలో బాకులు

****

అన్నదమ్ములు...

పుట్టుకతో అజాత శత్రువులు

 పెరిగెటప్పుడు మిత్రులు

పెళ్ళితరువాత శత్రువులు

*** *

బాల్యం...

అర్థం అయ్యేలోపే

సంతోషం అటకెక్కుతుంది

బతుకు సమరం మోదలయ్యి

చచ్చేంత వరకు బాధిస్తుంది

****

యవ్వనం...

పురి విప్పిన నెమలి నృత్యం

అదుపు తప్పితే పాము కాటులాంటిది ప్రేమలో బుసలు కొట్టిన,

కాటువేసిన కాటికి పంపిస్తుంది

****

మధ్య వయస్సు....

మండు టెండలాంటిది

యవ్వనంలో 

జ్ఞానాన్ని అలక్ష్యం చేస్తే 

వడగాలీల వచ్చే కష్టాలకు

ఎదురుదెబ్బల ఎండసెగ తగలాల్సిందే ******

వృధ్యాపం....

ముదిరి ఎండిన ఆకులాంటిది

మమత అనురాగాల చెట్టుకు 

ఎదో క్షణంలో ఊడిపోవాల్సిందే 


Rate this content
Log in