STORYMIRROR

ARJUNAIAH NARRA

Romance Fantasy Thriller

4  

ARJUNAIAH NARRA

Romance Fantasy Thriller

మసక మసకచీకటిలో....

మసక మసకచీకటిలో....

1 min
27

ఓ పుత్తడి బొమ్మ 

ముద్దుల గుమ్మ

పువ్వుల కొమ్మ

మాందారపు రెమ్మ

మల్లెల మెరుపుమ్మ

ఓ బంతి పూలచెండు

ఓ చేమంతి పూలదండ

ఓ అనాగ్రత పుష్పమా

భళా! ఏమి అందం...


నీ కురులు మల్లె మాలల ఊగుతూ

నన్ను మత్తులో దింపాలని ఊసులాడుతున్నవి

నీ ముంగురులు చిరుగాలికి సయ్యటలాడుతూ

నన్ను సరి చెయ్యమని ఉసిగొల్పుతున్నవి 

నీ కన్నులు నిండు కొలనులోని 

కలువ రేకుల కవ్విస్తున్నవి

భయంతో పరుగుపెట్టే లేడిలా 

నీ కనురెప్పలు రెప రెపలాడుతున్నవి

తేనెలొలుకుతున్న పెదవులు 

కమ్మని ముద్దుకోసం మద్దతు తెలుపుతున్నవి

అలలు దగ్గరగా వస్తుంటే దూరంగా

దూరమయితే దగ్గరకు పరిగెత్తే పక్షిల

నీ చెవుల బుట్టాలు కదులుతున్నవి

మంద్రమైన కసి మాటలను వినటానికి 

చెవులు అతృత పడుతున్నవి

పాలబుగ్గల చెక్కిళ్ళు కొంటేతనంతో అల్లరిపెడుతున్నవి

పాకనికి వచ్చిన మామిడి పండ్లతోటలో

కుసే గండు కొయిల గొంతుల

నీ నున్నని సన్నని మెడ సాగుతుంది

లేలేత జబ్బ మీద ఉన్న టీకా మచ్చ రచ్చ రచ్చ చేస్తుంది

నీ మనసు పెడుతున్న కలవరం వల్ల

మెడమీద చిరు చెమట ముత్యంలా మెరుస్తుంది

నీ ఊపిరి సెగలకు నీ పరువాలు ఉక్కిరిబిక్కిరవుతు

ఒత్తిళ్లను తట్టుకోవటానికి సంసిద్ధతను ప్రకటించాయి

మకరందం చిందే సమయంలో మిసమిసలాడే 

పువ్వుల రెమ్మల నాజుకుతనం నీ నవ లావణ్యం

నిత్యం అభిషేకం మరియు పూజకు పువ్వులు జల్లే 

చేతులు గాఢంగా పెనవేసుకొమ్మంటున్నవి

పైట కొంగు చాటున మాటి మాటికి తొంగి చూస్తూ

సేద తీరమంటుంది నీ లోతైన నాభి 

లోయలు మలుపులు నీ నడుం వంపులు

దాగుడు మూతల ఆటలు అడుకొమ్మంటున్నవి

సముద్ర తీరపు అలల వలె 

నీ చీర కుచ్చిళ్ళు నాట్యమాడుతున్నవి

అడుగుల సవ్వడికి అందెలు ఉత్సాహంగా 

సంగీత స్వరాలు పలుకుతున్నవి


అబ్బా ! ఒక్క క్షణము 

నా మనసులో కోరిక తేనెటీగల గుచ్చుతు  

పద పదమంటూ 

ఏమంటుందో తెలుసా!

కడలి నురగల్లో స్నానం చేద్దాం

పెదవి అంచున తేనేలు జుర్రుకుందాం

తడిబట్టల్లో తపనలు విడిచి

పొగమంచుల్లో కోరికలను కప్పుకుందాం

పొడి పొడి పొద్దుల్లో సిగ్గులను పూయిద్దాం

మసక మసక చీకటిలో ముద్దులు కొద్దాం

తొలకరి వెన్నెల్లో వన్నెలను వడ్డించు

జాము రేతిరి వద్దు వద్దన్నా వదిలేది లేదమ్మ

మిట్ట మధ్యనం మిగిలిపోయిన 

మనసు ఆకలిని తీర్చుకుందాం

తనువు దాహాన్ని తాగేద్దాం

చుక్కల పోదరిల్లలో తూగేద్దాం అంటుంది.

*************

నన్ను నేను మరిచి

నిన్ను నేను వలచి

నామనసు నాలోని 

కవిని పిలిచి

ఊహలను రంగరించి

పదాలను రచించేలా

చేసే అందానికి హ్యాట్సాఫ్

ప్రపంచ వింతలలో ఎప్పటికి

అద్భుత వింతే..... ఈ అమ్మాయిలు!



Rate this content
Log in

Similar telugu poem from Romance