తొలిసారి
తొలిసారి
ప౹౹
తొలిసారి చూసాక తెరలేపే ఆ తెమ్మెర
ఈలేసి ఎగిరే మనసు చిటారు కొమ్మన|2|
చ||
కలబోసినా కవ్వింతే కళ్ళతో ఆ చూపే
విరగపూసిన విరజాజే మేనుతో రూపే|2|
మునిమాపే తెలియకపోయే చూసికాచి
మునిజనులైనమూర్చపోదురే వేచిరోసి|ప|
చ||
వేసవంత చలితో వణికిలే ఆ చేయి తాకి
కౌగలింతలో తనువంతా కరిగే ఎకా ఎకి|2|
నవ్వితే నవరత్నాలే చిన్నబోయే సిగ్గుతో
తృళ్ళితే తూనీగా మూగ పోయే ఎగ్గుతో|ప
|
చ||
ఎంత కాదన్నను ఆ అందమే అరవిందం
చెంతచేరి చెలిమినే చెప్ప ఎంత వంద్యం|2|
వెన్నలా వెన్నెలలా ఆ మనసు తెల్లదనం
ఆ ప్రేమచూపులే కలలో సైతం కమ్మదనం ౹ప|