చెదిరిన ప్రేమలు
చెదిరిన ప్రేమలు
ప౹౹
ఏదురుగా నిలిచాం ఒకరికొకరిగా మౌనంగా
ఎదలోని సంగతలూ ఏమి చెప్పలేక దీనంగా ౹2౹
చ౹౹
వాడిన ఆ పూవూ వసివాడి రాలినే చెప్పకనే
తారాడిన తలపు తరలినే మనసూ విప్పకనే ౹2౹
ఆనాడు జరిగిన పొరపాటూ తెలుసున్నావా
ఏనాడు ఎడద ఎడబాటునే తలచుకొన్నావా ౹ప౹
చ౹౹
ఏ భావంలేక ఎండిన పొదరిల్లే మన ప్రతీకలే
ముభావంతో ముడుచినా చెదిరినే ప్రతీ కలే ౹2౹
నిరాశభావం నిష్క్రమించి ఉత్తేజం చెందాలి
నిరసన అనుభవం నిరాకరణము పొందాలి ౹ప౹
చ౹౹
ముడిపడని హృదయం మూగగ రోదించాల
ముకుళించని మనసుని పగతోనే వేదించాల ౹2౹
ముదిరిన కలతలను మూలకీడ్చి వేయలేమా
చెదిరిన ప్రేమలనే చేరదీసి ఏకమే చేయలేమా ౹ప౹