స్వయం వరం
స్వయం వరం


స్వయం వరం
.....................
అందంగాఎగురుతూ
మనసున్నమనుషులకు
కనులకువిందుచేయమని
రెక్కలిచ్చిరెక్కలకురంగులిచ్చి
ఎగురుతున్నరెక్కలకు తీపిఆకలినిచ్చి
చిలిపి కళ్ళనూ ఇచ్చి
తీపిని జుఱ్ఱేందుకు
పెదవిగొట్టాన్నిచ్చి
సజీవమైన
దారాల్నేని గాలిపటాల్లాంటి
ముచ్చటైనచిట్టిచిట్టి
సీతాకోకచిలుకల్నెగరేసింది ప్రకృతి!
స్వయంవరంలో
వరుల్ని వరించేందుకై
కదులుతున్న రాజకుమార్తెల్లాగా
సీతాకోకచిలుకలు చూస్తున్నాయ్ గర్వంగా!!
మీ ఆశల ఆకళ్ళను చల్లార్చేందుకు
విందులుగా పసందుగా
అందిస్తామంటూ...
రంగుల్ని రంగరించుకున్న
అందమైన ఆస్తుల్ని రిక్కలుగా
ప్రణయామృతసిద్ధుల్ని చుక్కలుగా
పరచిప్రదర్శిస్తూన్నాయ్
సీతాకోక చిలుకలకై .....
ఆశగా ఎదురుచూస్తూ!
నిలుచున్నాయ్ పురుషపుష్పాలు పాపం!
స్వయం వరం క్యూలో
రాకుమారవీరుల్లా!ప్రేమగా!