మనసుశబ్దాలువినబడుతున్నాయ్
మనసుశబ్దాలువినబడుతున్నాయ్
...........................
విధ్యుక్తధర్మంకోసం
ఉద్యుక్తులైనవైద్యులు
రాస్తున్న మందులు
చేస్తున్న చికిత్సలు
రికార్డుల్లోకెక్కుతున్నాయ్
భయంతో చేరుతున్నరోగుల వివరాలు
నయమై పోతున్న మనుషుల సంఖ్యలు
వార్తలై లెక్కల్లో కనబడుతున్నాయ్
మృత్యుదూత కరోనా ప్రభావంతో
వైద్యవిజ్ఞానం
చేతులెత్తేయడంతో
లబ్బు డబ్బుల గుండెశబ్దాలకు
అలవాటు పడ్డ స్టెతొస్కోపులు
మనసుబాధల్ని వినగల్గుతున్నాయ్
వాణిజ్యపాత్రమైన వైద్యం
పవిత్రతకుపాత్రమైన దృశ్యం
అహో!
అపూర్వం! అద్భుతం!రమ్యం!
అభిలషణీయం!హర్షణీయం!!