ఓ జీవితం?
ఓ జీవితం?


మారని మనుషులు,
తీరని కోరికలు,
సాయం చెయ్యలేని చేతులు,
లెక్క చెయ్యని ప్రాణాలు.
అందుకనే నేను చెబుతున్నాను వినండి!
జీవితమంటే ఒక ప్రయాణం,
జీవితమంటే పోరాటం,
జీవితమంటే ఒక సముద్రం,
జీవితమంటే ఒక గమనం,
జీవితమంటే ఒక మధురమైన జ్ఞాపకం,
జీవితమంటే ఒక త్యాగం,
జీవితమంటే ఒక కలల ప్రపంచం,
జీవితమంటే ఒక సహనం,
జీవితమంటే మనుషులకు మనుషుల మధ్య ఉన్న అనుబంధం,
జీవితమంటే కష్టసుఖాలు పంచుకోవడం,
జీవితమంటే లక్ష్యాన్ని చేరువైన పరమార్ధం.
అన్ని దానాల కన్నా,
అన్నదానం మిన్న.
ఉన్నోడికి విలాసం
లేనోడికి విలాపం.