కరోనా... కాటుక
కరోనా... కాటుక
1 min
34.9K
😷😷కరోనా కాటుక 😷😷
కరోనా... ఇది ప్రపంచానికి
ప్రమాదపు గుళిక
ఇది సూక్ష్మమే కానీ
పని అమేయము....
ఇది నిర్జీవినే.... కానీ
సజీవిని సంగ్రహిస్తుంది
దీనికి.......
రంగు, రుచి, వాసన అవసరం లేదు
చెయ్యి, ముక్కు, చీదడమే ముఖ్యం...
అది గంతులు వేస్తుంది.
కరాళ నృత్యం చేస్తుంది
కౌగిలిస్తుంది కంఠాన్ని ముద్దాడుతుంది
తన ప్రేమను గుండె గదుల్లోకి చేరుస్తుంది
నిశ్శబ్దపు గరళం ఎక్కిస్తుంది
మనిషి మనసును మోహిస్తుంది
మహా శక్తిని మలిన పరుస్తుంది.
ఇది పగ బట్టిన ప్రేమ
పిశాచి వైరస్
కాటిలోనే కనుమరుగవుతానంటుంది
కాచుకొని కబళిస్తుంది.
అందుకే.. ఓ.... మానవా..
నీ బుద్ది జ్ఞాన వైరస్ కు
పదును పెట్టు
కాటేస్తున్న కరోనాకు
పలుగును దించు
పాతర పెట్టు....
జై భారత్..... జై జై.. భారత్...