మనమంతా ఒక్కటే (prompt 28)
మనమంతా ఒక్కటే (prompt 28)


మన దేశం భారత దేశం, మనమంతా భారతీయులం
జాతి, మత, భాషా భేదాలున్నా, మనం భరతమాత బిడ్డలం.
మనలో మనకి ఎన్ని విభేదాలున్నా కలిసి పోరాడుతాం
మనపై ఎవరైనా దాడి చేస్తే కలిసికట్టుగా తిప్పి కొట్టగలం.
మనం ఒక్క మాటపై నిలిస్తే, ఎవరికీ ఇవ్వం జయించే అవకాశం
మనమంతా ఒక్కటై పోరాడి మన ఎదుట ఎవరినీ నిలవనవ్వం.
ప్రచ్ఛన్న యుద్ధమైనా, కాకున్నా ఎదుర్కొనే ధైర్యం కలవాళ్ళం
రండి! ప్రపంచానికి మనమంతా ఒక్కటే అని చాటి చెపుదాం.