STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Romance

4  

Venkata Rama Seshu Nandagiri

Romance

ప్రియవల్లభుడు

ప్రియవల్లభుడు

1 min
557


నీపై నాప్రేమ చినుకులా మొదలై

మేఘాల నుండి జారిన వర్షపు ధారలై

పుడమిని తాకిన నదిలా పొంగి వరదలై

నీమదిని చేరె, కడలిని కలిసిన నదియై

ఎద నిండిన నీతీయటి తలపులని

గుండె గూటిలో పదిల పరచుకొని

మదినిండా భావాలను ప్రోది చేసుకొని

ఆశతో నీరాకకై నేనిట వేచియుంటిని

నీరాకతో నామది పరవశించి పోయె

నీపిలుపు విని తనువు కంపించి పోయె

నీఎదుటకు రావాలన్న కలవరమాయె

నీఎదుట పడగానె కన్నులు వాలిపోయె

ప్రేమ నిండిన చూపుల నను కాంచినంతనే

తనువంత సిగ్గుతో ముకుళించి పోయెనే

ననుపట్టి నీకౌగిట బంధించి నంతనే

లోలోన ఆనందము పొంగి పొరలెనే

మృదు మధుర మాటలతో జయించె

నాలోని బిడియమును తొలగించె

నన్ను తన వశురాలిని గావించె

నామదికి సంతసము ‌నందించె

ఆతని రాకతో చీకటి వెలుతురాయె

కలలన్నీ ముంగిట సాకార మాయె

మది నిండిన ఆశలు వెల్లువై పోయె

నా జీవన గమనమే‌ మారి పోయె


Rate this content
Log in