STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Inspirational

4  

Venkata Rama Seshu Nandagiri

Inspirational

మన బాలలు

మన బాలలు

1 min
279

బిడ్డలకు తొలి గురువులు తల్లిదండ్రులు

ఇంటి నుండే మొదలౌను జీవిత పాఠాలు

జరిగినవి, జరగబోయేవి నేర్పేది గురువులు

కాలంతో, తోటి వారితో ప్రారంభం పోటీలు

సున్నితంగా నేర్పాలి బిడ్డలకు మంచిచెడులు

ఇవ్వడం నేరం కాకున్నా ఖరీదైన వస్తువులు

బిడ్డలకు తెలియచేయాలి సమాజ రీతులు

విలువైన వస్త్రాభరణాలకన్నా, విలువలు

వారి బంగరు భవితకు వేయు పునాదులు

వారికి కావలసినవి, కావు తారతమ్యాలు

స్వచ్ఛమైన స్నేహానికి అవి అడ్డుగోడలు

బిడ్డలు నేర్వవలసినది ఉన్నతికి దారులు

కాదు నిర్మించడం మాటలతో కోటలు

మాటపై నిలవాలి, వచ్చినా ఇబ్బందులు

నాడే మన మాటపై విశ్వసింతురు జనులు

కనుక. చిన్ననాటి నుండి నేర్పాలి పెద్దలు

మాట మీరక, మాటపై నిలుచు సద్గుణాలు

అవే వారి ఉజ్జ్వల భవితకు రాజమార్గాలు

ప్రతి బిడ్డకు బోధించిన మంచి గుణగణాలు

దేశమంతా వెదజల్లునుగా ఈ సౌరభాలు

విశ్వ విఖ్యాతి చెందరా మన భావి బాలలు


Rate this content
Log in

Similar telugu poem from Inspirational