నేనే సమయాన్ని
నేనే సమయాన్ని


నేనే సమయాన్ని,
నేనే వర్తమానకాలాన్ని,
నేనే గతించిన కాలాన్ని,
నేనే భవిష్యత్తు కాలాన్ని |౧|
ప్రతి క్షణాన్ని క్షుణ్ణంగా వీక్షించెను నేను,
ప్రతి శకం సుద్దికి సాక్ష్యం ఇవ్వగలను నేను,
మఱుసటిదినాన్ని ఈదినంగా మార్చెదను నేను,
ఈనాడును నిన్న నాడు ఆనాడు చేసెదను నేను |౨|
నిరంతరం చలనంలో ఉండెను నేను,
తిరిగి వెనక్కి ఎప్పుడూ చూడను నేను,
ఎప్పడూ నిష్పాక్షికంగా ఉండెను నేను,
మంచి చెడును దగ్గరగా చూసాను నేను |3|
ఆది మధ్యం అంతంలో ఉండను నేను,
ప్రతి ఒక్కరి ఆయువుకి కొలమానం నేను,
ప్రతి పురాణం ప్రతి గాథలో ఉండెను నేను,
రామాయణం మహాభారతంలో ఉండెను నేను |౪|
నేనే సత్తువగల సమయాన్ని,
నేనే ఇచ్చెదను ప్రతి కాలజ్ఞానాన్ని,
నేనే సృష్టిచేను ఎన్నెన్నో చరిత్రల్ని,
నా నిర్వహణ ద్వారా తెలిసెను ఫలితాలన్నీ|౫|