అద్భుతం ఈ జీవితం
అద్భుతం ఈ జీవితం


అద్భుతం ఈ జీవితంలో క్షణ క్షణం,
అతీతం అయ్యెను ప్రతి ఒక్క క్షణం,
ఇంకా కనపడెను ఆశ నిరాశల రణం,
సార్థకం చెయ్యాలి జీవన ప్రయాణం |౧|
ప్రతి దశలో అవగతం అయ్యెను క్రొత్త కోణం,
ప్రత్యేక స్థితిలో జ్ణాతం అయ్యెను కొత్త కారణం,
ఏ ముహూర్తం పైన చెయ్యలేం నియంత్రణం,
జనన మరణానికి అవసరం లేదు నిమంత్రణం |౨|
సమస్త జీవులు చేసెను తన ప్రాణ సంరక్షణం
అంతఃకరణం పొందాలి ఎప్పడు పరిష్కరణం,
సన్మార్గం సత్కార్యం ప్రత్యేక మనిషి ఆభరణం,
మేనుని సజీవం చేసెను ప్రకృతి ఇచ్చిన ప్రాణం |3|