STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

4  

Midhun babu

Classics Inspirational Others

తోడున్నది నీవుగా

తోడున్నది నీవుగా

1 min
2

కాలమాగి పోవాలని..కోరలేను అసలు..! 

ఈ రాత్రిని తెలవారగ..చెప్పలేను అసలు..! 


నీలికురుల నీడ చాటు..మేఘమెంత ముద్దు.. 

నా దాహం తీర్చమంటు..వేడలేను అసలు..! 


వేదించే శిశిరమేది..లేదన్నది నిజము.. 

మదికోకిల గీతమింక..పాడలేను అసలు..! 


నీ జతలో ఉన్నహాయి..ఇచ్చు స్వర్గమెచట.. 

ఈ వాడని చెలిమితోట..వీడలేను అసలు..


మనసుమించి మంచిపూవు..ఉన్నచోటు ఏదొ.. 

కదిలివెళ్ళు వసంతాన్ని..అడుగలేను అసలు..! 


తోడున్నది నీవేగా..శ్వాససాక్షి గాను.. 

నీ కరుణే దూరమైన..నిలువలేను అసలు..!


Rate this content
Log in

Similar telugu poem from Classics