మనసు మథనం
మనసు మథనం
ఏదో తెలియని
ఓ నిశ్శబ్దం నన్ను ఆవరించింది
బరువెక్కిన ఆలోచనలతో
మాటలన్నీ ఉలుకు పలుకు లేకుండా
మౌనమయ్యాయి
ఏదో కోల్పోతున్నానన్న వెలితి
నా ప్రతిబింబంలో కొట్టొచ్చినట్లు కనబడుతోంది !
ఎందుకనినన్ను నేను ప్రశ్నించుకున్న
సమాధానం మాత్రం అంతుచిక్కలేదు
ఏదో కాలుతున్న వాసన
నాసికాన్ని చేరింది
ఓసారి గతాన్ని తవ్వి
చూద్దామని తవ్వి చూసాను
కనుమరుగైన పాత గుర్తులు
ఒక్కసారిగా మదిలో మెదిలాయి
ఆ క్షణాన కళ్ళంట కారిన
కన్నీరులో తడిసి ముద్దయిపోయాను
కాలం మిగిల్చే
జ్ఞాపకాల తుట్టలో
అంతరంగంలో అలజడి రేపే
భావోద్వేగ ప్రవాహాల మధ్య
ఆత్రంగా ఎదురు చూశాను
నన్ను నన్నుగా అర్థం చేసుకునేవారు
ఎవరైనా కనబడతారేమోనని
కనుచూపుమేరలో
ఏ ఒక్క మనిషి జాడే లేదు
మళ్లీ నిరాశతో కూడిన శూన్యమే
తోడై మిగిలింది.
