STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

రామనెల

రామనెల

1 min
3


రామాలయ మేదంటే..పరమశివుని హృదయమే..!
శివుడంటే ఎవరంటే..చైతన్యపు రూపమే..!

జగమంతా నిండియున్న..రామునెలా చూపడం..
ప్రేమకు ప్రతిరూపమైన..సీతమ్మకు సొంతమే..!

నేనంటే రావణుడోయ్..నాదంటే రణమేమరి..
శివునివిల్లు ఏదంటే..పెనుమాయా లోకమే..!

మరి శివుడే మారుతియై..పుడమిపైన పుట్టెనే..
శ్వాసమాటు చూపినాడె..సీతారామ నిలయమే..!

రాజ్యకాంక్ష లేనివాడె..రామచంద్ర ప్రభువోయి..
అన్నమాట పాలించే..భరతత్వమె మౌనమే..!

సూర్యవంశ సంతానమె..సకలజీవ కోటిరో..
నిఖిలజగతి క్షేమకారి.. రామాయణ కావ్యమే.


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar telugu poem from Classics