మాతామహి మమత
మాతామహి మమత


మా మాతామహి మాటలు ఎప్పుడూ చిరస్మరణీయం,
ఆమె సర్వసమమైన మమత ఎప్పుడూ ప్రాతఃస్మరణీయం|౧|
చెప్పారు ఎన్నో మంచి విషయాలు,
తెలుగు వాచకం తెలుగు పద్యాలు అందున అందమైన భాగాలు |౨|
మా కోసం చేసారు ఎన్నో పాతరకమైన పిండివంటలు,
ఈ రోజులలో కనుమరుగైనవి అలంటి అరుదైన వంటలు |త్రీ|
నేర్పించారు మాకు వేకువజామున లేవటం,
ఎప్పుడూ బోధించారు సమయాన్ని సమంగా వాడుకోవటం |౪|
మానవుల మధ్య పంచారు ప్రేమానురాగాలు,
ఆమె మాటలు పాటలలో కనిపించాయి ఆనంద తరంగాలు |౫|
మా అమ్మమ్మ మాకు ఇచ్చారు బహుమతిగా మమత,
ఆమె గురుంచి చేయలేము ఎవరితోనూ సమత |౬|