అడ్డబొట్టు సామి
అడ్డబొట్టు సామి


ఏదో చీకటి దారి
క్రొవ్వు పట్టి మెరుస్తున్న భాండాగారాలు కనిపించాయి
ముందుకు నడిచాను
మర్మస్థానాల మూలుగులు వినిపించాయి
మరింత ముందుకు నడిచాను
ఈర్ష్యా ద్వేషములు జుగుప్స కలిగించే స్థితులు కనిపించాయి
నన్ను హత్తుకున్నాయి
కపాలములు
క్రుళ్ళిన శవముల చితి కనిపించినది
లేని వెన్ను కంపించిపోయినది
భయంతో శివా ఎక్కడ నీవు అని అరిచాను
చల్లటి గాలి వీచింది
బిల్వ పత్రమొకటి నా దోసిట్లో రాలింది
మరింత ముందుకు నడిచాను
శివలింగమొకటి దర్శనమిచ్చినది
బిల్వము దాని మీద ఉంచి
కౌగిలించుకున్నాను
దూరంగా డమరుక నాదం
నందీశ్వరుడు నాకు రక్షగా నిలిచాడు
అడ్డబొట్టు సామి నా అహం అణిచాడు
నన్ను బిడ్డగా కుటుంబంలో కలుపుకున్నాడు