విమలా దేవి
విమలా దేవి


వాహినుని వామాంకమును ధరియించినావూ
వెండి కొండ లోనే వసియించీనావూ
వెన్నెల నిచ్చే జాబిలి నీ తిలకమ్మూ
వేడిని మోసే సూర్యుడూ నీ నేత్రమ్మూ
విఘ్నములు బానే వినాయకుడూ
వల్లీపతి నీదు తనయులూ
వాణీ రమ లూ నిన్ను అర్చింతురు
వారాహీ చాముండీ నీదు అంశలేగా
వ్యాఘ్రము సైతం నిను చేరగనే
వ్యాకులతనొదిలీ వాత్సల్యమొందే
విజయము వినయము మాకీయవే
విమలా నామధేయిని వింధ్య నివాసిని